Monday, 27 July 2026 07:41:31 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లింగరెడ్డిగూడాలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న 1991-92 పూర్వ విద్యార్థులు...

Date : 09 October 2023 10:27 AM Views : 385

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : వారంతా చిన్ననాటి స్నేహితులు. ఒకేచోట చదువుకున్నారు. కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొంత మంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. షాద్ నగర్ నియోజకవర్గం లింగరెడ్డిగూడా ఉన్నత పాఠశాలలో 1991–92 ఏడవ తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థిని, విద్యార్థులు ఆదివారం లింగరెడ్డిగూడా గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు సాయన్న, రాజ్యలక్ష్మి, తిప్పన్నా, మల్లేష్, లక్ష్మయ్య, వారికి శాలువతో ఘనంగా సన్మానించారు 27మంది పూర్వ విద్యార్థులందరూ ఒకేచోట చేరవడంతో సందడి నెలకొంది. ఇక నుంచి టచ్‌లో ఉండాలంటూ ఫోన్‌ నంబర్లు తీసుకోవడంతో పాటు ఈ మధుర జ్ఞాపకాలను తమ తమ సెల్‌ఫోన్లలో బంధించుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు భీష్మ రవీందర్, శ్రీపాల్ రెడ్డి, పకీర్ పాషా, గణేష్, సురేందర్ రెడ్డి, శ్యామ్, ఎస్.రవి, సుధాకర్, శ్రీరాములు, జగన్ రెడ్డి, శంకర్, బి.మల్లేష్, జి.బాల్రాజ్, ఎం.యాదయ్య, లక్ష్మీకాంత్ రెడ్డి, ఎం శేఖర్, వెంకటేష్, కే. నర్సింలు, బి.నర్సింలు, సరళత, సునీత, మల్లేశ్వరి, పుష్పలత, సత్యమ్మ, కవిత. తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :