సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారుల పట్ల అధికారులు సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పాలకుర్తి పోలీస్ అధికారులకు సూచించారు వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం పాలకుర్తి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ కు పోలీస్ అధికారులు ముందుగా పుష్పగుచ్చాలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సిపికి గౌరవ వందనం చేశారు పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బంది నిర్వహించిన పరేడ్ తో పాటు కిట్ ఆర్టికల్స్ తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో భాగంగా సిపి పోలీస్ స్టేషన్ పరిసరాలను వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా పెండింగ్ కేసులు కోర్టు కేసులు ప్రస్తుతం దర్యాప్తుల్లో ఉన్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు అనంతరం సిబ్బందిని శాఖ పరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు చివరగా పోలీస్ కమిషనర్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని కలిగించడంతోపాటు పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రతి పోలీస్ ఉద్యోగి నిజాయితీ నిబద్ధతతో విధులు నిర్వహించాలి ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతో పాటు మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులు ఆలకించాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని సిపి పేర్కొన్నారు ఈ తనిఖీల్లో వేస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఏసిపి నరసయ్య పాలకుర్తి సిఐ జానకిరామ్ ఎస్ఐ పవన్ ఉన్నారు
-----------------------
Reporter