సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవరచెరువు మండలం లోని జెవివి మండల శాఖల ఆధ్వర్యంలో ప్రాథమికోన్నత పాఠశాల (ఉర్దూ)కొండకమర్ల, ప్రాథమిక పాఠశాల-2 కొండకమర్ల పాఠశాలలో జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం సందర్భంగా చంద్రశేఖర్ వెంకటరామన్ , తొలి తరం మహిళా శాస్త్రవేత్తల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ ఏడాది థీమ్ ప్రపంచ శ్రేయస్సు కోసం ప్రపంచ శాస్త్రం (గ్లోబుల్ సైన్స్ ఫర్ గ్లోబుల్ వెల్లబెయింగ్)(global science for global wellbeing)అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ విజేతలు బహుమతులు అందజేశారు ఈకార్యక్రమంలో జెవివి జిల్లా కార్యదర్శి గౌస్ లాజమ్, ప్రధానోపాధ్యాయులు షబానా, నాగరాజు మాట్లాడుతూ ఇదివరకటి శతాబ్దాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవి అని మన దేశంలో నైతే మహిళా శాస్త్రవేత్తలు సంఖ్య వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉండేది మహిళ చదువుకోవడమే అరుదైన ఆ కాలంలో సైతం కొందరు మహిళలు పరిస్థితులకు ఎదురిది మరీ శాస్త్రవేత్తలు గా తమ సత్తా చాటుకున్నారు అని శాస్త్ర సాంకేతిక రంగాల్లో వారు మైలురాళ్ల లా నిలిచిపోయే విజయాలు సాధించాలని మన దేశానికి చెందిన తొలితరం మహిళా శాస్త్రవేత్తల గురించి విద్యార్థులకు తెలియజేశారు. అని వారి జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అతావుల్లా, అహమ్మద్ ఆలీ, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin