సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిద ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమస్యనుపరిష్కరించాలని ధరఖాస్తులు చేసిన ఆర్జీదారులను వివరాలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఎండార్స్ చేశారు. సారపాక గ్రామం, బూర్గంపాడు మండలానికి చెందిన పూజారి శ్రీదేవి భద్రాచలం మొబైల్ కోర్టు నందు 8 సంవత్సరాల నుండి స్వీపర్ కం కుక్గా పనిచేయుచున్నానని, తనకు జీవించడానికి ఎలాంటి ఆదాయ వనరులు లేవని, భర్త చనిపోయారని, తనకున్న ఇద్దరి సంతానం పోషణ, చదువులకు వచ్చే వేతనం 6 వేల రూపాయలు సరిపోవడం లేదని, అది కూడా రెండు, మూడు నెలలకొకసారి ఇస్తున్నారని, తనకు కాంట్రాక్టు పద్దతిలో కుకోపోస్టు ఇప్పించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. పాల్వంచ మండలం, జయమ్మ, వికలాంగుల కాలనీలకు చెందిన ఇసనపల్లి నాగరాజు, ఎస్.కె. రెబానా, యం. వెంకటేశ్వర్లు గతంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కోసం దరఖాస్తు చేయగా అర్హులైన పేదలను గుర్తించి ఎంపిక చేసి ప్రభుత్వం ద్వారా విచారణ నిర్వహించియున్నారని, కానీ ఇంతవరకు ఆ ఇళ్లను వారికి ఇవ్వలేదని, ఆ ఇళ్లను మాకు ఇప్పించగలరని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం డిఆర్ఓకు ఎండార్స్ చేశారు. టేకులపల్లి మండలం, శంభునిగూడెం గ్రామానికి చెందిన సనప కృష్ణవేణి, భర్త బట్టు సురేష్ (లేటు) కోయ కులానికి చెందిన తాను 24.5.2011న అంగన్వాడి కార్యకర్తగా విధుల్లో చేరి 4 నెలలు విధులు నిర్వహించానని, తరువాత గోప్యాతండా వాసులు స్థానికంగా ఉన్న వారికి ఇవ్వకుండా వేరే గ్రామం వారికి ఉద్యోగం ఇచ్చారని పిర్యాదు చేయడం వల్ల తన యొక్క నియామకాన్ని నిలిపివేశారని, విచారణ నిర్వహించి తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం సంక్షేమ అధికారికి ఎండార్స్ చేశారు. అశ్వారావుపేట మండలం, బబ్బువారిగూడెంకు చెందిన కట్టం అర్జమ్మ, భర్త భీమయ్య గత సంవత్సరం నిర్వహించిన పోడు భూముల సర్వేలో పట్టాదారు పాసుపుస్తకం 9ఏ అని వచ్చిందని, దానిలో 9 కుంటులుగా నమోదైందని, దానికి రైతుబంధు నిధులు కూడా రావడం లేదని, అట్టి పాసుపుస్తకం ప్రింటు తప్పుపడిందని, సరిచేసి ఇస్తామని చెప్పారని, ఇంతవరకు ఇవ్వలేదని, అట్టి పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం కలెక్టరేట్ సి సెక్షన్ పర్యవేక్షకులకు ఎండార్స్ చేశారు. ఇల్లందు మండలం, సుభాష్నగర్ గ్రామానికి చెందిన జి అన్నపూర్ణ తాను కోయ కులమునకు చెందినదాననని, సుభాష్నగర్ పంచాయతీ పరిధిలోని తన యొక్క సొంతింటి స్థలములో భవన నిర్మాణం చేసుకుంటున్నానని, ఇట్టి నిర్మాణంపై అక్రమ నిర్మాణమని, కొన్న దినపత్రికలలో రాయడం జరిగిందని, ఏజన్సీ ప్రాంతంలో ఎస్టీ కులానికి చెందిన తాను భవన నిర్మాణం చేసుకుంటుంటే ఈ విధంగా కథనాలు రాయడం వల్ల తాను ఎంతగానో భాద చెందుతున్నానని, ఇట్టి కథనాలు రాసిన వారిపై చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం డిపిఆర్ ఓకు, కొత్తగూడెం ఆర్డీఓకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ రాంబాబు, మధుసూదన్రాజు, డిఆర్డిఓ రవీంధ్రనాథ్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin