సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం ఆర్సి నవంబర్ 30. ప్రకాశం జిల్లా. త్రిపురాంతకం మండలం ముడిమల గ్రామంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గూడూరి నిరీక్షణ బాబు అధికారులతో కలిసి ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పింఛన్దారులకు పంపిణీ కార్యక్రమం లో పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి మరిన్ని పెన్షన్లు అందించడం జరుగుతుందని అలాగే అనర్హులైన పెన్షన్ దారులను తొలగించడం జరుగుతుందని ఆయన అన్నారు ముడివేముల గ్రామంలో వితంతువులకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin