Monday, 27 July 2026 07:37:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నగరములో చెరువులు, నాలాలను ఆక్రమించిన వారిపై కేసులు నమోదు...

Date : 31 August 2024 02:22 AM Views : 393

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : నగరంలో చెరువులు, నాళాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను ఉదయం నుండి నేలమట్టం చేస్తోంది హైడ్రా. ప్రస్తుతం ఈ టాపిక్‌ నగరంలోనే కాదు.. రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్‌ అయ్యింది, అక్రమ కూల్చివేతలు కొనసాగిస్తూనే ఉంది హైడ్రా. తాజాగా నగరంలోని ముషీరాబాద్‌ నియోజవర్గం రాంనగర్‌లో చేపట్టారు. శుక్రవారం ఉదయం నుంచే కూల్చివేతలు జరుగుతున్నాయి. మణెమ్మ బస్తీలో నాలాలను ఆక్రమించి నిర్మించిన అనధికార నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. అయితే.. రాంనగర్‌ పరిధిలోని స్థానికుల ఫిర్యాదుల మేరకు హైడ్రా కిమిషనర్ రంగనాథ్‌ బుధవారమే వివిధ అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించారు. అనధికార నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. ఆ తర్వాత అనధికార నిర్మాణాలను కూల్చియాలంటూ టౌన్‌ప్లానింగ్ అధికారులను రంగనాథ్ ఆదేశించారు. ఆయన సూచనల మేరకు హైడ్రా అధికారులు శుక్రవారం ఉదయమే రంగంలోకి దిగి.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టారు. కాగా.. హైడ్రా పరిధికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నోటీసులు అన్నీ హైడ్రా ద్వారా జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శిని సీఎస్‌ శాంతి కుమారి ఆదేశించారు. నోటీసుల జారీ, తొలగింపు చర్యలు అన్నీ ఒకే విభాగంగా ఉండాలనీ.. అవన్నీ హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఇక హైడ్రా పరిధి ఓఆర్‌ఆర్‌ వరకు ఉంటుందని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :