సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : దసరా పండుగ నుంచి చలికాలం ప్రారంభమైన సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలో ఉన్న దేవాలయాల ముందు, పాత బస్టాండ్ చుట్టుపక్కల , ఇతర ప్రదేశాలలో ఇల్లు లేకుండా రోడ్ల వెంబడి నిద్రించేవారు మరియు రామస్వామి గుట్ట దగ్గర ఉన్న నిరుపేదలను 50 మందిని ఓపెన్ ఐస్ సొసైటీ ద్వారా గుర్తించి బ్లాంకెట్స్ ( దుప్పట్ల) లను పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డి పల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పల్నాటి కృష్ణారెడ్డి మాతృమూర్తి పల్నాటి పద్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇచ్చిన పదివేల రూపాయల తో. ఈ దుప్పట్లను పంపిణీ చేశామని సొసైటీ ప్రధాన కార్యదర్శి సులువ శ్రీను. తెలిపారు. ఈ సందర్భంగా పల్నాటి కృష్ణ రెడ్డి మాతృమూర్తి జ్ఞాపకార్ధంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓపెన్ ఐస్ సొసైటీని గుర్తించి సహాయం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పోలిశెట్టి. మహేష్, చిలకరాజు సతీష్, సులువ చందు,గడ్డం అనిల్, పిల్లి .శివ, మట్టపల్లి రవీందర్, రామిశెట్టి శ్రీనివాస్ ,తుమ్మకొమ్ము. కృష్ణ, చింతకాయల రాంబాబు, దగ్గుపాటి రమేష్ , పెద్దరాపు నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin