సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని దద్దనాల చెరువు 1వ వార్డ్ కి చెందిన వివిధ పార్టీల నుండి కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు 50 మంది హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి అని నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలి అంటే బి ఆర్ ఎస్ పార్టీ తోనే సాధ్యం అని వారి పూర్తి మద్దతు తెలుపుతూ. వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.పార్టీలో చేరిన వారు ఎస్.రమేష్,ఎ.అశోక్, లక్ష్మణ్,నరేష్,గంగ,ఎన్ వీరన్న,శివుడు,నాగార్జున,హుస్సేన్,నాగుల్ మీరా,లోకేష్,మహేష్,టి.రాజా,నజీర్,నాగరాజు,సురేష్,ప్రేమకుమార్,తరుణ్,భరణి ,జాని,ఖాజా భాయ్, శివుడు,మున్నా,నాగార్జున,గుంజ శ్రీను, భూరాజు మద్దెల సాయి తదితరులు పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు బిఆర్ఎస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు.ప్రతి ఒక్క కార్యకర్త కు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని గులాబి జెండానే శ్రీరామరక్ష.. అని అన్నారు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోతూ అభివృద్ధిలో సీఎం కెసిఆర్ నేతృత్వంలో దూసుకుపోతున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం, బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు.తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ని అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారని అన్నారు..బిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి వ్యక్తికి సాదర స్వాగతం పలుకుతున్నాం అని అన్నారు...శ్రమించి పని చేసే ప్రతి కార్యకర్త కి గుర్తింపు ఉంటుంది అని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ చిట్యాల అమర్నాథ్ రెడ్డి,ఒకటో వార్డు కౌన్సిలర్ కొమ్ము శీను, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు, పాల్గొన్నారు.
-----------------------
Admin