సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులతో నిర్వహించిన అత్యవసర సమావేశనికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ నిన్న హైదరాబాద్ గాంధీభవన్ లో జరిగిన సమావేశం లో పార్టీ విధానపరమైన నిర్ణయాలను తీసుకోవటం జరిగిందని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం శ్రీ రాహుల్ గాంధీ గారిపై కక్ష సాధింపు దిశగా రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటుకు నిరసనగా రాష్ట్రపతి గారికి లేఖ లు రాసే కార్యక్రమం గ్రామస్తాయి నుంచి పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టాలని మరియు రానున్న రోజులలో పార్టీ ఎటువంటి పిలుపును ఇచ్చినా శ్రేణులు అందరూ కలిసి కార్యక్రమాలను జయప్రదం చేయాలని,ఇటువంటి కార్యక్రమాలలో అనుబంధ సంఘాలు చురుకైనా పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్,జిల్లా NSUI అధ్యక్షులు వేగినాటి ఉదయ్,జిల్లా OBC సెల్ అధ్యక్షులు ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు పుచ్చకాయల వీరభద్రం,జిల్లా ST సెల్ అధ్యక్షులు వైరా పి సి సి అధ్యక్షులు మాలోత్ రాందాస్ నాయక్,జిల్లా SC సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య,జిల్లా మైనారిటి అధ్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్,జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్ లు పాల్గొన్నారు.
-----------------------
Admin