సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణ జమాతే ఇస్లామి హింద్ మహిళా విభాగం మరియు గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళాదినోత్సవ వేడుకలను నిర్వహించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా జమాతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షురాలు పర్వీన్ మరియు సందేశ ప్రచార కార్యదర్శి షేహేనాజ్ జహంగీర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా షిటీం ఎస్.ఐ రమాదేవి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో స్త్రీ ఒక తల్లిగా ఒక చెల్లిగా తనవంతు కృషి చేయడంలో ఎలాంటి కష్టాలనైనా భరిస్తుందని అన్నారు.ఆడపిల్లలను తల్లిదండ్రులు ధైర్యం చెప్పి వారిలో ఆత్మస్థైర్యం నింపాలన్నారు. ర్యాగింగ్ భూతానికి బలికాకుండా పిల్లల్లో అవగాహన కల్పించాలన్నారు. జమాతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షురాలు పర్వీన్ మాట్లాడుతూ మహిళల పట్ల సోషల్ మీడియా సాక్షిగా పోకిరీలు చేసే దురాగాతాలను రూపు మాపేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని, మహిళలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి వారికి మగవారితో సమానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. ఇస్లాం మహిళలకు పురుషులకు సమాన హక్కులు కల్పించిందని, తల్లిదండ్రులు ఆస్తిలో పురుషులతో పాటు ఇంటి ఆడబిడ్డకు హక్కు కల్పించిందని, సృష్టికర్త అయిన అల్లాహ్ తల్లి కళ్ళ కింద స్వర్గాన్ని ఉంచారని అలంటి మహిళలను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మహిళల హక్కుల సాధన కోసం జమాతే ఇస్లామి హింద్ అన్ని వేళలా మహిళలకు అండగా ఉంటుందని అన్నారు.మహిళా దినోత్సవ వేడుకల్లో షీ టీిం సబ్ ఇన్స్పెక్టర్ రమాదేవి, ఎంపీటీసీ భద్రమ్మ, లక్ష్మి దేవి పల్లి సర్పంచ్ తాటి పద్మ , జె.ఐహెచ్ సభ్యులు సఫురా, దిశ ప్రొటెక్షన్ జిల్లా ఉపాదక్షురాలు మాధవి లత, స్పోక్ పర్సన్ పద్మ , సందేశ ప్రచార అధ్యక్షురాలు, సుధారాణి టీచర్,తదితర మహిళలు పాల్గొన్నారు....
-----------------------
Admin