సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు : మండల పరిధిలోని మహమ్మదాబాద్ క్రాస్ వద్ద అంగన్వాడి సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ మండల కార్యదర్శి రమణ పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ ఈనెల10 అఖిల భారత కోర్కెల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూట్ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలి. హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సం||లకు పెంచాలి. ప్రమోషన్లో రాజకీయ జోక్యం అరికట్టాలి. 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. అంగన్వాడీ విద్యను బలోపేతం చెయ్యాలి. పిల్లలకి యూనిఫామ్, అమ్మఒడి అమలు చెయ్యాలి. వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలి. గ్యాసును ప్రభుత్వమే సరఫరా చెయ్యాలి. 2017 నుండి పెండింగ్లో ఉన్న టిఎ బిల్లులు వెంటనే ఇవ్వాలి. సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, భీమా అమలుచెయ్యాలి. లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి, ఆయిల్, కందిపప్పు క్వాంటిటీ పెంచాలి.సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి. పాత్యకి గురైన హనుమాయమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. నష్టపరిహారం చెల్లించాలి. గ్రేడ్ || సూపర్ వైజర్ పోస్టులకు వయోపరిమితి తొలగించాలి. 2022 లో పరీక్ష వ్రాసి పెండింగ్లో ఉన్న గ్రేడ్ ॥ సూపర్ వైజర్ పోస్టులలో మిగిలిన 164 పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలి. అంగన్ వాడీలను అవమానించే వైఎస్సాఆర్ యాప్లో 1.2.9 కొత్త వర్షన్ ను వెంటనే రద్దు చెయ్యాలి. ఈ కార్యక్రమంలో యూనియన్ లీడర్లు, వై రంగమ్మ, కమలమ్మ ,వరలక్ష్మి, మణిమాల ,ఆదిలక్ష్మి, మేరీ సుజాత, విమలమ్మ, షమీం, పద్మావతి, లక్ష్మీదేవి, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin