సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీసంత్ సేవాలాల్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీపీ భూక్యా గోపాల్ నాయక్ అన్నారు జాన్ పహాడ్ దర్గా గ్రామ పంచాయతీ కల్మెట్ తండాలో గిరిజన శక్తి రాష్ట్ర కార్యదర్శి మధు నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలలో భాగంగా భోగ్ బండారు కార్యక్రమం నిర్వహించారు సేవాలాల్ పూజారి రమేష్ మహారాజు సేవాలాల్ చరిత్రను ప్రజలకు వివరించారు మధు నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ జయంతిని ఆప్షన్ హాలిడే గా ప్రకటించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తండ పెద్దలు లకపతి నాయక్ సర్పంచ్ గోరి ఎంపీటీసీ విజయ వెంకటి గిరిజన నాయకులు ధరావత్ బాల్సన్ నాయక్ బనావత్ సైదా నాయక్ రాపోలు నవీన్ మాజీ ఎంపిటిసి శివరాం నాయక్ మోతిలాల్ వెంకటేశ్వర్లు నాగరాజు శోభన్ సైదా బదియా ధిప్ల వీరన్న శేషు శోభన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin