సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంబాడి రవి, భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి బీజేపీ పార్టీతోనే సాధ్యమని ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు కొలిపాక దేవేందర్ యాదవ్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొంకిస విఘ్నేష్ బీజేపీ నాయకులు పొదిల అశోక్, బానోత్ శివ, గాలి రామన్న, మరియు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin