Sunday, 26 July 2026 04:18:11 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారానికి హాజరైన ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి...

Date : 25 November 2023 06:53 AM Views : 261

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఎన్నికలంటే కాంగ్రెస్ పార్టీకి అయిదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండుగ లాంటిదని, కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఐదేళ్ల ప్రజల విలువైన భవిష్యత్తనీ అడ్డగోలుగా సంపాదించి వచ్చిన వాళ్లు అందరిని డబ్బు సంచులతో కొనాలని చూస్తున్నారనీ ప్రజలారా పారాహుషార్ అంటూ షాద్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం వెలిజర్ల, దూసకల్, లింగారెడ్డి గూడ గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మరో విశిష్ట అతిథిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యకు మద్దతుగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోలలో పాల్గొని టిఆర్ఎస్ శ్రేణులు తదితరులు మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు అని చెప్పి నట్టేట ముంచిందనీ ఎవరికైనా అనుమానం ఉంటే కర్ణాటక సరిహద్దు దగ్గరే ఉంది కాబట్టి స్వయంగా వెళ్లి తెలుసుకోవచ్చన్నారు. గత బీజేపీ పాలనలో 9 గంటల కరెంట్ ఇస్తే కాంగ్రెస్ వచ్చిన తర్వాత 4, 5 గంటలు మాత్రమే ఇస్తుందనీ, తమ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని అక్కడి రైతులు చెప్తున్నరని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3 గంటలు కరెంట్ చాలు అంటున్నడని, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 5 గంటలు చాలు అంటున్నడనీ, 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ ఉండగా కాంగ్రెస్ ని నమ్మి మోసపోదామా? గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత కరెంట్ అని చెప్పి ఉత్తుత్తి కరెంట్ చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. రాత్రి పూట కరెంట్ ఇస్తే పాములు, తేళ్లు కరిచి, కరెంట్ షాకులు కొట్టి రైతులు చనిపోయింది వాస్తవం కాదా? కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలంటే కారుకే ఓటు గుద్దాలన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు దేవుడెరుగు కానీ ఆర్నెల్లకు ఒక సీఎం మారుడు మాత్రం పక్కా అని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే అంజయ్యకు పార్టీ శ్రేణులు ప్రజలు బ్రహ్మరథం పట్టారు మహిళలు విజయ తిలకాలు దిద్దుతూ మంగళ హారతులు పట్టారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున వందలాదిగా హాజరయ్యారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: