సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : మిషన్ భగీరథ పథకం నిధులు మింగేసిన కార్పోరేటర్" దిన పత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. గురువారం గోపి చెరువును పరిశీలించారు,చెరువుల అభివృద్ధి, సుందరీకరణ లో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ లోగల గోపి చెరువును జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి గోపి చెరువు సుందరీకరణ గురించి నగర మేయర్ విజయలక్ష్మితో కార్పొరేటర్ పర్యటించారు, ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ చెరువుల సంరక్షణతో పాటు వాటి సుందరీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు,ప్రధానంగా విలువైన చెరువు స్థలాల సంరక్షణ, చెరువు కట్టల పటిష్టం, డ్రైనేజీ నీరు చేరకుండా డైవర్షన్ ఛానెళ్ల నిర్మాణం, వాకింగ్ ట్రాక్, పచ్చదనం సహా పలు ఇతర అభివృద్ధి పనులతో అనతికాలంలోనే గోపి చెరువు రూపురేఖలు మార్చుకుని ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధం అయ్యేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు,అదేవిధంగా వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పరిసరాల పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రోగాల బారిన పడకూడదని, గోపినగర్ స్థానిక వాసులకు స్వయంగా ఇండ్లను సందర్శించి వారికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ పాలవెల్లి, ఎస్ఐ రఘు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, శానిటేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వారి సిబ్బంది, గోపినగర్ వాసులు యాదా గౌడ్, గోపాల్ యాదవ్, సైదులు, తుకారాం తదితరులు పాల్గొన్నారు.....
-----------------------
Admin