సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న షాద్ నగర్ నియోజక వర్గ ఆశాలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం సరికాదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ అక్రమ కేసులను ఎత్తివేస్తామని షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్, ఆశాలకు అండగా ఉంటానన్న కాంగ్రెస్ పార్టీ. ఆశాలకు ఆర్థిక సాయం చేసిన శంకర్... తాసిల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేస్తున్న ఆశాలకు షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. మంత్రి కేటీఆర్ షాద్ నగర్ పర్యటన సందర్భంగా నిరసన తెలిపిన ఆశాలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని ఆశల సమస్యలు తీర్చకుండా ఇలా దొడ్డిదారిన కేసులు పెట్టి బెదిరిస్తే ఊరుకోమని అన్నారు. ఆశాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఫిక్స్‌డ్ వేతనం కావాలి. ఇప్పుడు ఇన్సెంటివ్ రూపంలో ఇస్తున్నారని కనీసం రూ.18వేల జీతం కావాలని ఇన్సూరెన్స్ లేదు. పీఎఫ్ ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేవు ఇవన్ని కల్పించాలనీ అదనంగా చేయించుకున్న పనులకు డబ్బులు చెల్లించలేదని, పెండింగ్‌లో ఉన్న బిల్లులన్ని వెంటనే రిలీజ్ చేయాలని వీర్లపల్లి శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
-----------------------
Admin