Sunday, 26 July 2026 02:37:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి...

Date : 21 January 2023 01:03 AM Views : 1265

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా అధికారులతో కంటి వెలుగు, సముదాయంలో కార్యాలయాల నిర్వహణ పై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రత్యేక అధికారులు కంటి వెలుగు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నమోదు నుండి పరీక్ష పూర్తయ్యే వరకు క్యూ, వేచివుండు ఏర్పాట్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మెప్మా, స్వయం సహాయక బృందాలు ప్రజల సమీకరణ విషయంలో ఉదయం, మధ్యాహ్నం పూటలుగా కార్యాచరణ చేయాలన్నారు. జిల్లాలో గురువారం 55 శిబిరాలు నిర్వహించి 5, 615 మందికి పరీక్షలు చేసినట్లు ఆయన తెలిపారు. ఒక్కో శిబిరంలో రోజుకు కనీసం 150 మందికి పరీక్షలు చేసేలా జన సమీకరణ చేయాలన్నారు. కంటి వెలుగుపై ఆడియో సందేశంతో విస్తృత ప్రచారం చేయాలన్నారు. శిబిరాల్లో రోజువారి కళ్ళాద్దాల పంపిణీని తెలియపర్చి, వారికి కావాల్సిన ఇండెంట్ ను ముందస్తుగా సమర్పించాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ప్రారంభోత్సవాన్ని ఘనంగా చేసినట్లు, విజయవంతానికి ఇచ్చిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించిన అధికారులను కలెక్టర్ అభినందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అన్ని శాఖలు ఒకే గొడుగు క్రింద పనిచేస్తున్నట్లు, ఒకరికొకరు సహకరిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఇంకనూ తరలింపు చేపట్టని కార్యాలయాలు వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలని, నేటి నుండి కార్యాలయాలు క్రొత్త ప్రాంగణంలో నిర్వహించాలని ఆయన తెలిపారు. సమయపాలన పాటించాలని, వంద శాతం సిబ్బంది హాజరును జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆయన అన్నారు. కాలపరిమితి దాటిన ఫైళ్లు, ఫర్నిచర్ ఖండం చేయాలని ఆయన తెలిపారు. పార్కింగ్ కు కేటాయించిన స్థలంలోనే వాహనాల పార్కింగ్ చేయాలని ఆయన అన్నారు. సముదాయంలో ఏర్పాటు చేసిన క్రేచే ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సముదాయంలో అన్ని రకాల వసతులు కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, డిఆర్వో ఎన్. శిరీష, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: