Monday, 27 July 2026 05:33:52 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలి ఆశా వర్కర్ల డిమాండ్‌...

Date : 30 August 2023 02:59 AM Views : 365

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ నియోజకవర్గం ఆశా వర్కర్ల ఇచ్చే వారితోషకం పెంచి, ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు నిర్ణయించాలని కోరుతూ మంగళవారం ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వాలంటీర్‌ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సర్దార్ ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ వినతిపత్రం అందజేశారు. తమ పనికి తగిన వేతనం ఇవ్వడం లేదని, వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎమ్మేల్యే కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్ రాజు, ఉపాధ్యక్షుడు బి సాయిబాబు, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాధిక, కోశాధికారి లలిత మాట్లాడుతూ.. ఆశావర్కర్లు కరోనా మహమ్మారి కాలంలో వైరస్‌ను నియంత్రించడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. అయితే ఆశాలకు కేవలం రూ.9,750 పారితోషికం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. వారి పనికి తగిన వేతనాలు ఇవ్వడం లేదని, పారితోషికాలను రూ.18,000కు పెంచి ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయించాలని కోరారు గతంతో పోలిస్తే ఆశ వర్కర్లకు పనిభారం విపరీతంగా పెరిగిందని పారితోషకంతో పాటు పారితోషకాలు లేని అనేక పనులను ప్రభుత్వం ఆశలతో చేయిస్తున్నది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సబ్ సెంటర్ బస్తీ దావాఖానాలో పనిచేయాలని ఆశలకు ప్రభుత్వం చెబుతున్నది. ఇంత పని చేస్తున్న తమకు కేవలం 9750 రూపాయలు పారితోషకం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తున్నది ఒకవైపు పని భారం పెరిగింది మరొకవైపు నిత్యవసరదరాలు ఆకాశం నిండుతున్నాయి ఈ పరిస్థితుల్లో వచ్చే పారితోషకాలు సరిపోక ఆశ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు రోజువారి రిజిస్టర్లు రాయడం సర్వేలు చేయడం ఆన్లైన్ పనిచేయడం బీపీ షుగర్ థైరాయిడ్ అన్ని రకాల జబ్బులకు గుర్తిస్తూ ప్రజల ఆరోగ్యం గురించి ముందస్తు జాగ్రత్త పరుస్తున్నారు. అయినా తమలకు కనీస వేతనం 18000 ఎందుకు ఇవ్వటం లేదని వారు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను ప్రశ్నించారు. వెంటనే సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనిచో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ఆశ వర్కర్లు చేస్తున్న కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి శ్రీను నాయక్, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్ నాయక్, భవన నిర్మాణ కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షులు జంగయ్య, కార్యదర్శి వెంకటేష్, ఆశా వర్కర్లకు సంపూర్ణం మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు సుజాత, సునీత, ఎంత లక్ష్మి, సరిత, వసంత, శంకరమ్మ, మంజుల, పావని, నూర్జహాన్, జయమ్మ, పారిజాతం, యాదమ్మ, రాధిక, జాంగిర్ బి, కవిత, లక్ష్మి, మల్లీశ్వరి, శ్రీలత, పార్వతి, రమాదేవి, జ్యోతి, మాధవి, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: