సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్య సాయి జిల్లా ఆధ్యాత్మికమైన పుట్టపర్తి కేంద్రాన్ని టెంపుల్ జోన్ గా ప్రకటించాలని రత్నాకర్ కు వినతి పత్రం అందజేసిన సాయి యూత్ సభ్యులు.... శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి జిల్లా మున్సిపల్ కేంద్రంలో ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి పట్టణంలో రాజకీయ పార్టీల కార్యక్రమాలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జే రత్నాకర్ గారికి మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన* సాయి యూత్ సభ్యులు అనంతరం మాట్లాడుతూ శ్రీ సత్యసాయి పుట్టపర్తి ప్రజలు టెంపుల్ జోన్ ఎజెండాగా చేర్చాలని...ప్రశాంతతకు మారుపేరైన పుట్టపర్తి పట్టణంలో ఇటీవల కాలంలో రాజకీయ పార్టీల నాయకులు దాడులు చేసే సాంస్కృతిని ప్రారంభించారని,వీటివల్ల ప్రశాంతి నిలయానికి వస్తున్న విదేశీ భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నందున ఇకనుంచి రాజకీయ పార్టీల కార్యక్రమాలు,బహిరంగ సభలు,ఫ్లెక్సీలు పట్టణంలో సత్యమ్మ దేవాలయం నుండి గోకులం ఆర్చ్ సర్కిల్ వరకు టెంపుల్ జోన్ గా ప్రకటించి తగిన చర్యలు తీసుకోవాలని లేకపోతే మేము సాయి యూత్ అంతా నాయకులతో కలిసి నిరాహార దీక్షలు చేయడానికైనా సిద్ధమని తెలియజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ శ్రీ సత్య సాయిబాబా వారు నడయాడిన పుణ్య ప్రదేశంలో ఇలాంటి దుర్ఘటనలు రాబోవు రోజుల్లో తలెత్తకుండా చూడాలని పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రాన్ని టెంపుల్ జోన్ గా ప్రకటించి ఇరు పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు జరగకుండా చూడాలని సాయి యూత్ భక్తులు అలాగే అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ రంగా వ్యాపారస్తులు అందరూ కలిసి తెలియజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపతి,సామకోటి కత్తి రాజారెడ్డి ఆదినారాయణ, రాజారెడ్డి, ఉట్ల సోము,రామాంజనేయులు,అబ్దుల్ ఆబు,అమ్మినేని కేశవ నాయుడు,డా.తిరుపతేంద్ర,జ్యోతి ప్రసాద్ బాబు,సూరి,ప్రతాప్ నాయుడు,నరేందర్ రెడ్డి,బేకరీ నాయుడు,శంకర్ రెడ్డి,కూర్మ నాయకులు,మల్లికార్జున తదితరులు గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin