సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా మండల సబ్ ఇన్స్పెక్టర్ చంద్ర శేఖర్ విచ్చేసారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ యువజన నాయకులు సబ్ ఇన్స్పెక్టర్ ని శాలువతో సత్కరించి, అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించారు.. సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ... భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడు, భవిష్యత్ తరాల కోసం, బడుగు జీవుల రక్షణ కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు జరిపేలా వ్యవస్థలు, ప్రభుత్వాలు పని చెయ్యాలన్నారు. వ్యవస్థలపై దాడులు జరుగుతుంటే మళ్లీ వాటిని రక్షించేది కూడా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమేననని తెలిపారు. .ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన నాయకులు చల్ల రాంబాబు,చల్ల పుల్లయ్య ,పెద్దగొండ్ల పుల్లారావు, ఇనపనూరి రాంబాబు , యదల వెంకన్న ,పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin