సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలలో చిత్ర విచిత్రాలు జరగడం సహజమేనని, పార్టీలకతీతంగా మంచి కోసం పాటుపడాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం పట్టణంలోని గుడిపల్లి శ్రీనివాస్ తన నివాసంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలు, పట్టణాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు, యువకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ సేవలో ముందుండి, ప్రజలకు మేమున్నామని భరోసానిచ్చే నాయకులకు మనం ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మెజార్టీ ప్రజల అభీష్టం మేరకే మనం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపైనే ఉందని అన్నారు. ప్రజలకు ఏది మంచి జరుగుతుందో ఒకటికి రెండు సార్లు ఆలోచించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుందామని తెలిపారు. విడతలవారీగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో నాయకులు, యువకులతో ప్రతిరోజు సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి నిర్ణయాలను పరిగణలోకి తీసుకుని ముందుకు సాగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయ పార్టీల నాయకులు, యువకులు తదితరులు ఉన్నారు. తర్వాత షాద్ నగర్ లో బహిరంగ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
-----------------------
Admin