సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టే నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో అర్హులైన ప్రైవేట్ టీచర్లకు ఇందిరమ్మ ఇల్లు మరియు పణిగిరి రామస్వామి గుట్ట వద్ద డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని హుజూర్ నగర్ తహసిల్దార్ నాగార్జున రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గొట్టే నాగరాజు యాదవ్ మాట్లాడుతూ గతంలో ఎలక్షన్ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ప్రైవేట్ టీచర్ల లో కనీసం 60 శాతం మందికి ఉండటానికి ఇల్లు లేవని,చాలీసాలని జీతాలతో జీవితం కొనసాగిస్తున్నారని ప్రైవేట్ టీచర్ల సమస్యలను తెలియజేసి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని కోరడం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి మన ప్రభుత్వం రాగానే ప్రైవేట్ టీచర్లకు న్యాయం చేస్తానని సానుకూలంగా స్పందించారని మీరు కూడా అర్హులైన ప్రైవేట్ టీచర్లందరికీ ఇందిరమ్మ ఇల్లు మరియు పణిగిరి రామస్వామి గుట్ట వద్ద ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా మా టీచర్లకు కేటాయించాలని తహసిల్దార్ ను కోరారు. .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మన్నెం నాగరాజు,సహాయ కార్యదర్శులు ఏ విజయ్ కుమార్,ఎం నాగశ్రీ మరియు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin