సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ నగరంలోని బీఆర్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తో కలసి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కేంద్రంలో అందుతున్న పోషకాహారం, పిల్లల హాజరు, శుభ్రత, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను మంత్రి నిశితంగా పరిశీలించారు. పిల్లలకు అందించే ఆహార నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు. గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు సమర్థవంతంగా అమలవ్వాలని ఆదేశించారు
-----------------------
Reporter