సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం చంద్రయ్య పల్లె గ్రామంలో విషాదం నెలకొంది గ్రామానికి చెందిన మొద్దు రాకేష్ సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములతో కురుస్తున్న వర్షం లో భావి దగ్గర నుండి ఇంటికి వస్తున్న క్రమంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి అందరితో సరదాగా గడిపే రాకేష్ మృతి వార్త శోక సంద్రంలో ముంచింది రాకేష్ అకాల మరణం కుటుంబ సభ్యులను కన్నీరు మున్నీరు లో ముంచేసింది
-----------------------
Reporter