సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఎర్రుపాలెం మండల పరిధిలోని పలు గ్రామాలలో శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముమ్మరంగా పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా మండల పరిధిలోని బంజర గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ బానోతు రంగా రాష్ట్ర మంత్రి పువ్వాడ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ వీడి వారి అనుచరులతో బిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారికి విఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు నాగేశ్వరరావు, ఖమ్మం ఎమ్మెల్సీ తాత మధు, జడ్పీ చైర్మన్ కమల్ రాజు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin