సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో దాబా వద్ద లారీ కింద గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం పాలైనట్టు షాద్ నగర్ సిఐ ప్రతాప్ లింగం తెలిపారు. ఈనెల 30వ తేదీన ఫరూక్ నగర్ మండలం రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో డిఎస్ చౌదరి మార్వాడి ధాబా వద్ద లారీ నెంబర్ ఎపి 37 టిఎఫ్ 3685 లారీ టైర్ల మధ్య తలకు బలమైన గాయాలతో రక్తస్రావంతో పోలీసులకు లభించాడని తెలిపారు. పెట్రోలింగ్ వాహన పోలీసులు మోహన్బ్ లాల్, గోవర్ధన్ గౌడ్ డ్యూటీలో ఉండగా లారీ సంఘటన కనిపించినట్టు రిపోర్ట్ చేశారు. అయితే 25 నుండి 30 సంవత్సరాల అందాజా వయస్సు కలిగిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియ రాలేదని పేర్కొన్నారు. ఫోటోలో ఉన్న వ్యక్తికి సంబంధించిన సమాచారం పోలీసులకు తెలుపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లారీ డ్రైవర్ నిర్లక్ష్యం పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్టు సిఐ ప్రతాప్ లింగం మీడియాకు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
-----------------------
Admin