సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం, చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా ఆనేక రకాల భావజాలాలకు నిలయం. భావ స్వేచ్చ, వారు నమ్మినటువంటి రాజకీయ పరమైన విధానాల ప్రచారానికి ఇబ్బంది లేకుండా ముందుకు సాగించే సమాజం ఖమ్మంలో ఉన్నారు. నాగరికతలో బాగా వెనుక బడిన సమాజం నుంచి మొదలుకొని ఆధునికతను సంతరించుకున్న ఆలోచనలు ఆహ్వానించి పాటించే వారు కూడా ఖమ్మంలో ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మిగత రాష్ట్రాల సీఎంలను తీసుకొచ్చి ఖమ్మంలో నిర్వహించిన సభ దేశానికి దశ, దిశ ఎజెండా ఇస్తామన్న ప్రచార ఆర్భాటం చేశారు. కానీ ఆలాంటి ఎజెండానే కన్పించలేదు. దేశ సంస్కృతిని, సంపదని స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి తయారు చేసుకున్న సంస్థలు, వ్యవస్థలను దహించి వేస్తున్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎజెండా ఇస్తామని ప్రచారం ఆర్భాటం చేసిన సభలో ఆలాంటి అంశాలు కనిపించలేదు. బిఆర్ఎస్ సభ వల్ల దేశానికి, ఖమ్మం ఉమ్మడి జిల్లాకు పనికొచ్చే ఎజెండా కన్పించలేదు. ప్రజలు ఆశీంచిన అంశాల ప్రకటన లేకపోవడం విచారకరం. ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో గిరిజనలు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్య పరిష్కారం గురించి బిఆర్ఎస్ సభలో ప్రస్తావనే లేదు. తెలంగాణలో ప్రతి జిల్లాకు యూనివర్శిటి ఉంది. కానీ ఖమ్మం ఉమ్మడి జిల్లాకు యూనివర్శీటి లేదు. ఇవ్వాలని కోరిన ప్రకటన చేయలేదు. పేదలకు, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు గురించి సభలో ఊసే ఎత్తలేదు. విభజన చట్టం హక్కుగా పొందిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి పోరాటం చేయాలని కోరాము. దీని గురించి మాట్లాడనే లేదు. సింగరేణి బొగ్గు గనులను ప్రయివేటీకరణ చేస్తున్న బిజెపి చర్యలకు ఏలా అడ్డుకట్ట వేస్తారో సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్ర ప్రజలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఆనేక సమస్యల గురించి కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి వినతి పత్రం ఇచ్చాను. వాటిని పరిగణలోకి తీసుకొని ప్రకటించాలని సీఎంను డిమాండ్ చేస్తున్నా. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చినప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ హాయంలో ఏర్పాటు చేసిన సంస్థలు, వ్యవస్థలు, ప్రణాళికలు, ప్రజాస్వామ్య బలోపేతానికి వేసిన పుణాదులు, మిశ్రమ ఆర్ధిక విధానాలు తీసుకొచ్చి దేశం పురోగమనం సాధించేందుకు కాంగ్రెస్ చేసిన కృషినే ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఆనేక సంస్థలకు అధిపతులై దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నారంటే దేశంలో కంప్యూటర్ రెవల్యూషన్ తీసుకొచ్చిన స్వర్గీయ ప్రధాని రాజీవిగాంధి గొప్పతనమే. ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి హరిత విప్లవం, పాడిని అభివృద్ధి చేసి శ్వేత విప్లవం, నీలి విప్లవంతో పాటు బ్యాంకుల జాతీయకరణ, భూసంస్కరణల అమలు, గరిబీ హఠావో నినాదం, ప్రభుత్వ విద్య సంస్థల్లో చదువుకున్న పేదలకు, సామాన్యులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్. పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా, సర్వీసు ఇతర రంగాల్లో భారత్ అగ్రగామిగా నిలబడటానికి కాంగ్రెస్ తీసుకొచ్చిన అభివృద్ది పథకాల వల్లనే సాధ్యమైంది. జాతులు, కులాలు, ప్రాంతాలు, మతాల పేరిట దేశ ప్రజలను విభజించి, విద్వేషాలను రెచ్చగొట్టి, ఘర్షణలు సృష్టించి, రక్తపాతంతో రాజాకీయలబ్ధి పొందాలని చూస్తున్న బిజెపి నేడు దేశానికి పెనుసవాల్ గా మారింది. దేశానికి పెను సవాల్ గా మారిన బిజెపిని కట్టడి చేయడం కేవలం కాంగ్రెస్ సాధ్యమైతుంది. దేశంలోని ప్రజాస్వామిక వాదులు, లౌకిక వాదులు కాంగ్రెస్ చేసే ప్రయత్నంలో భాగస్వాములు కావాలి. సాధించుకున్న లౌకిక వ్యవస్థను, సామ్యవాద విధానాలకు ఇబ్బంది పెడుతున్న బిజెపిని దూరం పెట్టడానికి మనందరం ముందడుగు వేద్దాం. ఈ నెల 30న రాహుల్ గాంధి చేపడుతున్న భారత్ జోడో యాత్ర శ్రీనగర్ ముగుస్తున్నందన పెద్ద సభ నిర్వహిస్తున్నారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ నెల 26 నుంచి రెండు నెలల పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర మొదలవుతుంది. బ్లాక్ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు రెండు నెలల పాటు నిర్వహించే హాత్ సే హాత్ జోడో యాత్రలో ఇంటింటికి వెళ్లి రాహుల్ గాంధి గారి సందేశాన్ని వినిపిస్తాం. దేశాన్ని కాపాడుకుందామని విజ్ఞప్తి చేస్తాము కాంగ్రెస్ ఆలోచనలు, భావా జాలాన్ని ప్రచారం చేసి హాత్ సే హాత్ జోడో యాత్రలో ప్రజలను భాగస్వాములను చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కాలి. జాతీయ స్థాయిలో బలమైన పుణాదులు కలిగి ఉండి లౌకికతత్వం కలిగిన కాంగ్రెస్ పార్టీతోనే బిజెపిని కట్టడి చేయడం సాధ్యం. కాబట్టి దేశ ప్రయోజనాల దృష్టా కాంగ్రెస్ తోనే వామపక్షాలు కలిసి ప్రయాణం చేస్తే బావుంటుందని విజ్ఞప్తి. ఇది నా అభిప్రాయం మాత్రమే. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కాంగ్రెస్ లోకి రావాలని మీడియా సాక్షిగా ఆహ్వానిస్తున్నాను. కాంగ్రెస్ లోకి రాకుండ నేడు అడ్డుకాదు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు భట్టి గట్టిగా సమాధానం ఇచ్చారు. జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,టి పి సి సి ఉపాద్యక్షులు ,మాజీ శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు,పాలేరు నియోజకవర్గ పి సి సి సభ్యులు రాయల నాగేశ్వరరావు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు పులిపాటి వెంకయ్య,ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు పుచ్చకాయల వీరభద్రం,వైరా నియోజకవర్గ పి సి సి సభ్యులు మాళోత్ రాందాస్ నాయక్,జిల్లా కాంగ్రెస్ నాయకులు సయ్యద్ హుస్సేన్,నగర బి సి అద్యక్షులు బాణాల లక్ష్మణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin