సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : పాలేరు నియోజకవర్గ పరిధిలోని తిరుమలాయపాలెంలో ఆదివారం నిర్వహించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, బంగారు తెలంగాణ కలలు కల్లలయ్యాయి అని అన్నారు. మాయ మాటలు మోసపు వాగ్దానాలు చేస్తూ ప్రభుత్వం మనగడ సాగిస్తుందని, కన్నీళ్లు అప్పులు ఆత్మహత్యలే మిగిలాయని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆరు శతాబ్దాలుగా సబ్బండ వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు దగాపడ్డారని, ధనిక రాష్ట్రమైన తెలంగాణను ఈ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టింది అన్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ, ఇప్పుడు నీళ్ల కోసం నిధుల కోసం బతుకు కోసం పోరాటం చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు మారుతాయని కన్న కలలు కలలుగానే మిగిలాయి అని ఆయన ఘాటుగా విమర్శించారు. గడిచిన నాలుగు సంవత్సరాలలో రైతు రుణమాఫీ ఎంత చేశారని ప్రశ్నించారు. దళిత బంధు పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 100 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు గిరిజన బంధం అంటూ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రతి ఎన్నికలలో చాట్లో తవుడు పోసి కుక్కలను ఉసిగొలిపినట్లుంది. రాష్ట్రం నాలుగు పాయింట్ రెండు శాతం మాత్రమే వైద్యం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించి ప్రజలను వైద్యానికి దూరం చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారాల్లోకి రావడం కాదు ఇప్పుడున్న ప్రజాప్రతిని ఉప్పెనలో కొట్టకపోవడం ఖాయమని ఆయన అన్నారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించిన ఏ గూటి పక్షి ఆ గూటికి పోతుందని జెండా ఏదైనా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖమ్మంలో ఉన్న ఎమ్మెల్యేలను ఎంపీని ఇంటి పంపడమే అన్నారు...
-----------------------
Admin