సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం మంగళవారం సాయంత్రం వెంకటాపురం పంచాయతీ నల్లగట్లపల్లిలో జోరు వానలో (డి డబ్ల్యూ ఎంఏ) పిడి రామాంజనేయులు , ఎంపీడీవో పోలప్ప కలిసి అమృత సరోవర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పిడి రామాంజనేయులు అమృత్సర్ పనులు నాణ్యతగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. చెరువుకు పోయే దారిలో కంపచెట్లు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు .ఎంపీడీఓ పోలప్ప మాట్లాడుతూ పనులను చూసి సంతృప్తి వ్యక్తం వ్యక్తం చేశారు. ఈ పనుల వల్ల రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు అంతేకాకుండా భూగర్భ జలాలు ఇంకి బోర్లలో సమృద్ధిగా నీళ్లు వస్తాయని తద్వారా పంటలు పండించుకోవచ్చని తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాధి సిబ్బందిని అభినందించారు .ఈ కార్యక్రమంలో ఏపీఓ సోమశేఖర్ రెడ్డి ,ఈసీ అంజనేయులు, సాంకేతి సహాయకులు రాజారెడ్డి రాజేంద్ర చంద్రారెడ్డి, పాల్గొన్నారు.
-----------------------
Admin