సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు షాద్ నగర్ లో తెలంగాణ సంక్షేమ సంబురాలు సభలో మాట్లాడుతున్న కేశంపేట జడ్పీటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి. నాడు ఉమ్మడి పాలనలో తెలంగాణ కి ఒక్కరూపాయి ఇవ్వం ఎం చేసుకుంటారో చేసుకోండి అన్న నాటి పాలకులు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఆడబిడ్డ పెండ్లి ఆర్థిక భారం కావద్దనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా రూ. 1,00,116 ఆర్థిక సాయం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. నేడు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రతీ యేట బడ్జెట్ లో 60 వేల కోట్లకు పైగా కేటాయిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ ప్రవేశపెట్టిన తెలంగాణ సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి, కంటి వెలుగు, ఆసరా పెన్షన్, కేసీఆర్ కిట్ వంటి పథకాలు దేశానికే ఆదర్శం గా నిలిస్తున్నాయి..
-----------------------
Admin