సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కు కూతురు పుట్టిన సందర్భంగా మెగా అభిమానులు కొత్తగూడెం లో వేడుకలు చేశారు. రాంచరణ్ తేజ్ - ఉపాసన ల దంపతులకు ఈరోజు పండంటి ఆడపిల్ల పుట్టడంతో అభిమానులు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్దించి పూజలు నిర్వహించారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం రాష్ట్ర నాయకులు విల్సన్ బాబు ఆధ్వర్యంలో కేక్ కత్తిరించి, ఆనాధులకు ఆహార పొట్లాలు, స్వీట్లు పంచి అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ అభిమాన నాయకుడు తండ్రి కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
-----------------------
Admin