సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన ఉల్వలపురి నరసింహ రావు (40 సం.) భవన కార్మికుడిగా మరియు మార్బుల్ వర్కర్ గా పనిచేస్తున్నాడు.తేదీ 29.6.24 రోజున మృతుడు తన మేస్త్రీ అగు దార శ్యాం తో కలిసి హుజూర్ నగర్ పట్టణానికి చెందిన చింతకాయల కోటయ్య ఇంటిలో మార్బుల్ పని నిమిత్తం మిషన్ తో బండలు పాలిష్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మిషన్ హ్యాండిల్ కు కరెంట్ సరఫరా అయ్యి కరెంట్ షాక్ తగిలి క్రింద క్రింద పడగ మిషన్ మీద పడడంతో తీవ్ర గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం హుజూర్ నగర్ ప్రభుత్వ హాస్పటల్ కు తీసుకొని వెళ్లి అక్కడ నుండి మెరుగైన చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ హాస్పటల్ కు తీసుకొని వెళ్లి చికిత్స అందిస్తుండగా ఈ రోజు ఉదయం ఛనిపోయినాడు అని మృతుని భార్య రజిత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు....
-----------------------
Admin