సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు : ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి మీడియా ప్రతినిధులుకు 2018 సంక్రాంతి పండుగ రోజు నలశింగయ్యగారిపల్లిలో తన నివాసంలో విందు భోజనం ఏర్పాటు చేసిన సందర్భంలో ప్రతి ఒక్కరికీ 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీపీఐ పుట్టపర్తి నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండల కేంద్రoలో మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఇంటి స్థలాలు కోసం రెండవ రోజు రిలే నిరాహారదీక్షలు చేస్తున్న జర్నలిస్టులకు సీపీఐ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూజర్నలిస్టులు సమాజానికి, రాజకీయ పార్టీలకు తమ విలువైన సమయాన్ని హెచ్చిస్తూ సేవలందిస్తూన్నరన్నారు. అలాంటి వారిని చులకన భావంతో చూడకుండా ప్రభుత్వం నుంచి అందే ఏకైక సంక్షేమ పథకం ఇంటి స్థలం మంజూరుకు ఎమ్మెల్యే, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకులలో ముఖ్యుడు వి.కే. ఆదినారాయణరెడ్డి 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి సిపిఐ నాయకులు నివాళులు అర్పించారు. జర్నలిస్టుల రిలే నిరాహారదీక్షను తెదేపా నియోజకవర్గ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి సాయిరాం ఆంజనేయులు దీక్షలో పాల్గొన్న మీడియా ప్రతినిధులకు పూలమాలలు వేసి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేసే వరకు కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చలపతి, మహిళ సంఘం నాయకురాలు రత్నాభాయి,నాయకులు నాగేంద్ర, పుష్పాల రామాంజులు, అంజినప్ప, కే చలపతి, సత్యప్ప, సిద్దమ్మ,వసంతు, అంజినప్ప, సిద్దప్ప, గంగులమ్మ, ఆదేమ్మ, రత్నమ్మ, రవణమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin