సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలోని 21 వ వార్డులో అధ్వానంగా కాలువలు కొత్తగూడెం మున్సిపాలిటీలోని 21 వ వార్డు లో కాలువల పరిస్థితి దారుణంగా ఉంది. కాలువల్లో మురికి పేరుకుపోయి విపరీతమైన దోమలు దుర్వాసన వస్తుందని స్థానికులు వాపోతున్నారు. పలుమార్లు స్థానిక కౌన్సిలర్ కి చెప్పిన పట్టించుకోని వైనం. చాలా పురాతనమైన ఈ కాలువ పునర్నిర్మానం చేయాలని స్థానికులు చాలాసార్లు అక్కడి కౌన్సిలర్ దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడంలేదని మొరపెట్టుకుంటున్నారు. పాత కాలువ నైతే శుభ్రపరిచిన దాఖలాలే లేవు అనీ స్థానికులు అంటున్నారు. ఇకనైనా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు....
-----------------------
Admin