సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం లోని కొత్తగూడెం పట్టణ నడిబొడ్డున ఉన్న 30వ వార్డులో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు.ఆదివారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి బీఎస్పి కార్యక్రమంలో భాగంగా వార్డులో కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.అనంతరం కామేష్ మాట్లాడుతూ అయిదు సంవత్సరాలకు ఒకసారి ఓట్ల కోసం మాత్రమే ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు వస్తున్నారు తప్ప గెలిచిన తర్వాత ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. 30వ వార్డులో 10,15 రోజులకు ఒకసారి కిన్నెరసాని మంచినీరు వస్తుందని వార్డు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.మార్చి నెల నుంచి వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ సమస్య యధావిధిగా ఉందని ఆరోపించారు.గతంలో కొత్తగూడెం పట్టణ ప్రజల సౌకర్యార్థం వార్డుల్లో సింగరేణి యాజమాన్యం వీధి కులాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.అయితే కిన్నెరసాన్ని నీరు ఇంటింటికి సరఫరా చేస్తున్నామని డాంబికాలకు పోయి స్థానిక ఎమ్మెల్యే వనమా సింగరేణి వీధి కులాయిలను నిర్వీర్యం చేశారని,దీంతో ప్రజలకు కిన్నెరసాని నీరు,సింగరేణి సరఫరా చేసే మంచినీరు రెండు లభించక ఈ వేసవికాలం నానా అగచాట్లు పడ్డారని అన్నారు.సమస్యల పరిష్కారం దిశగా ప్రజలు అడుగులు వేయనంతవరకు నియోజకవర్గంలో చుట్టపు చూపుగా ఎమ్మెల్యేలు వచ్చిపోతుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాటం చేస్తూ ప్రజా జీవితంలో ఉన్న స్థానికుడికి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ,అగ్రవర్ణ పేదల కోసం పనిచేసే బీఎస్పి పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.మూసధోరణిలో ఎన్నికల్లో ఓట్లు వేయడం వల్లనే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా,కొత్తగూడెం నియోజకవర్గంలో కనీసం అభివృద్ధి జరగకుండా పోతుందని అన్నారు.కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిపై తాను ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించానని,కిన్నెరసాని మంచినీటి సరఫరా కోసం నూతన పైప్ లైన్ నిర్మాణమే శరణ్యమని అన్నారు.రానున్న ఎన్నికల్లో బీఎస్పీ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,జిల్లా కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,అల్లకొండ శరత్,శారదా,సుజాత,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin