Monday, 27 July 2026 03:43:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రైతు సంక్షేమ పథకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని... -ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

Date : 09 June 2023 07:26 AM Views : 445

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక రైతు సంక్షేమ పథకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం సాధించలేని అభివృద్ధిని తెలంగాణ సాధించిందని తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బొత్తల పాలెం లో చేపట్టిన చెరువుల పండగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కరెంటు, సాగునీరు, తాగునీరు, గ్రామాల సమగ్ర అభివృద్ధి జరిగిందన్నారు. 170 కోట్లతో ఈ ప్రాంతంలో లిఫ్ట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయకట్టు చివర ప్రాంతానికి ఇది వరంలా మారనుందన్నారు. ప్రతి ఇంటికి తమ ప్రభుత్వ సంక్షేమ పథకం అందిందని చెప్పుకొచ్చిన ఎమ్మెల్యే, చెరువుగట్టులకు ఉన్న గ్రామదేవతలను ఘనంగా కొలిచే సాంప్రదాయాన్ని మారువబోమన్నారు. మరోసారి కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మరింత అభివృద్ధి జరుగుద్దన్న విషయాన్ని మరువద్దన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భోగాల వీరారెడ్డి, ఉప సర్పంచ్ వెంకటయ్య, ఆ పార్టీ మండల అధ్యక్షుడు కిష్టపాటి అంజిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ఎమ్మార్వో శ్రీదేవి, ఎంపీడీవో వెంకటాచారి, వైస్ ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అందే లక్ష్మీనారాయణ, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అనంత ప్రకాష్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు. మహిళలు కోలాటం, బతుకమ్మలు పేర్చటం, బోనాలు ఎత్తడంతో పండగ వాతావరణం నెలకొంది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :