సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : షాద్ నగర్ పట్టణంలో పలు ఎరువుల, సీడ్ ప్రాసెసింగ్ సంస్థలపై పోలీసు శాఖ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. షాద్ నగర్ పట్టణ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి నిశాంత్ కలిసి స్థానిక విత్తనాలు, ఎరువుల దుకాణాలు, ప్రాసెసింగ్ యూనిట్లను తనిఖీ చేసినట్టు నవీన్ కుమార్ తెలిపారు. శంకర్ సీడ్స్, రైతన్న విత్తనాల సంస్థలలో నకిలీ విత్తనాలు, స్టాక్ అవుట్ డేటెడ్‌ని తనిఖీ చేశారు. తక్కువ నాణ్యత గల విత్తనాలు, నకిలీ విత్తనాలను ఉపయోగించ వద్దని తెలియజేశారు. నకిలీ విత్తనాలు ఇతర సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరుకోరారు.
-----------------------
Admin