సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : నిరంతరం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పరితపించి పేద ప్రజలకు సుపరిపాలన అందించిన మహా నేతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైయస్ఆర్టిపి పార్టీ షాద్ నగర్ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఎండి ఇబ్రహీం అన్నారు. శనివారం వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద వైఎస్ఆర్టిపి పార్టీ అధినేత్రి షర్మిలమ్మ, వైఎస్ఆర్ భార్య విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి ఆ పార్టీ షాద్ నగర్ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఎండి ఇబ్రహీం తదితర షాద్ నగర్ నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎండి ఇబ్రహీం మాట్లాడుతూ.... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ అందించిన సేవలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని ఆయన కొనియాడారు. వైయస్ఆర్ లాంటి నాయకులు ఆయన సమకాలీక కాలం లో గాని, భవిష్యత్తులో కానీ మరొకరు లేరు, రాలేరని ఆయన పేర్కొన్నారు. పేద ప్రజల కోసం, వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం నిరంతరం పరితపించేవారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం వైఎస్ఆర్టిపి పార్టీ అధినేత్రి షర్మిలమ్మ నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ చూపిన మార్గంలో, ఆయన అడుగుజాడల్లో నాయకులుగా మేము నిరంతరము పనిచేసి పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఎండి ఇబ్రహీం ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఫరూక్ నగర్ మండల ప్రెసిడెంట్ గోపి నాయక్, మండల ప్రెసిడెంట్ ఈదులపల్లి నరసింహ, డెబిట్, జాఫర్, నబి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. షాద్ నగర్ లో వైస్సార్ విగ్రహానికి పార్టీ నాయకులు ఘన నివాళులు. షాద్ నగర్ పట్టణ పరిధిలోని ముఖ్య కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వై ఎస్ ఆర్ టి పి పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహం వద్ద పార్టీ నాయకులు కేక్ కట్ చేసిఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, కోన దేవయ్య, యువ నాయకుడు శీలం శీను, తదితర వైఎస్ఆర్టిపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin