సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వస్కుల రామయ్య ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఇట్టి కార్యక్రమానికి బి అర్ ఎస్ మండల అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే సుభాష్ చంద్రబోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టాడని ఆయన మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయిందని అతను ప్రయాణిస్తున్న జపాన్ విమానం 1945 ఆగస్టు 18న కూలిపోయిందని అనాడు జపాన్ పత్రికలు ధ్రువీకరించి ముద్రించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు కొమ్ము సైదులు ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రధాన కార్యదర్శి బానోతు పాండు నాయక్ అధికార ప్రతినిధి మాలోతు రవీందర్ నాయక్ కోశాధికారి బేత శివారెడ్డి సహాయ కార్యదర్శి పల్లె సుధాకర్ మలోతు నాగు నాయక్ నూకపంగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin