Monday, 27 July 2026 07:20:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మధిర పట్టణం చాలా చారిత్రాత్మకమైన పట్టణం... -భట్టి భట్టి విక్రమార్క

Date : 21 February 2023 01:25 AM Views : 722

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : మధిర పట్టణంలోని పలు ప్రాంతాలలో సోమవారం నాడు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ముమ్మరంగా పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పత్రిక సమావేశంలో వారు మాట్లాడుతూ. హైద్రాబాద్ రాష్ట్ర స్వాతంత్య్రం కోసం పోరాటానికి చేయూత అందించిన ప్రాంతం మధిర అని అన్నారు. నాడు హైదరాబాద్ రాష్ట్రం స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్న రోజుల్లో సర్దార్ జమలాపురం కేశవరావు నాయకత్వంలో హైద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న స్వామి రామానంద తీర్థ నిజాం నవాబ్ రజాకార్లతో పోరాటం చేస్తున్న సమయంలో గాయాలు అయిన వారికి ఇక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి అండగా ఉండి మరలా వారిని పోరాటానికి సన్నద్ధం చేసిన ప్రాంతం ఈ మధిర అని అన్నారు. ఇలాంటి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాలి అన్నదే నా కోరిక, నా ప్రయత్నం అని, ఇలాంటి ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం దానికి తోడుగా విద్య, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందితే మధిర ప్రాంతానికి తిరుగుండదని తెలిపారు. విద్య అభివృద్ధిలో భాగంగా మనం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, రెగ్యులర్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, అలాగే జే. ఎన్. టి. యు లాంటి కలశాల కూడా ఒకటి కావాలని కోరడం జరిగిందని, అందుకు నా ప్రయత్నం చేస్తానని తెలిపారు. గతంలో అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామని, అలాగే కస్తూరిబా లాంటి రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఏర్పాటు చేసుకున్నామని వాటికి అనుబంధంగా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా మారుతున్న పారిశ్రామిక, ఆధునిక అవసరాలకు అనుగుణంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలతో ఆ డిగ్రీ కలశాల ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. అలాగే ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని కూడా ప్రయత్నం ఉన్నదని, నేను మొదట నుండి చెప్పేది మధిర పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవసరం తద్వారా పట్టణం పరిశుభ్రంగా, దోమల బెడద, పందుల బెడద లేకుండా ఉంటుందని, దానికోసం మొన్న అసెంబ్లీలో మాట్లాడానని. అందుకు కృషి చేస్తానని తెలిపారు. మధిరలో ప్రవేశించడానికి అలాగే బయటకు వెళ్ళడానికి ఒక్కటే రహదారి ఉన్నదని, అందువలనే మధిర విస్తరణ కూడా వేగవంతంగా జరగడంలేదు అందుకు అనుగుణంగా సమాంతరంగా రహదారులు అభివృద్ధి చేయాలని, తగు ప్రణాళికల అందుకు సిద్ధంగా ఉన్నాయని, ఇందిరా డైరీ ఏర్పాటు కూడా అవసరం వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కు సంబంధించి ఇందిరా డైరీలో అందర్నీ భాగస్వాములు చేసి ఇది ఏర్పాటు చేయాలని ఆలోచనా అందుకు కూడా నా ప్రయత్నం చేస్తానని తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: