Monday, 27 July 2026 05:19:18 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీ భక్త కనకదాసు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన సోమకోటి ఆదినారాయణ...

Date : 23 December 2022 01:15 AM Views : 498

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కొత్తచెరువు మండల కేంద్రంలో ఎర్రబల్లి గ్రామంలో శ్రీ భక్త కనకదాసు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన ఎర్రబెల్లి కురుబ కుటుంబ సభ్యులు.. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండల కేంద్రంలో ఎర్రబల్లి గ్రామం నందు శ్రీ భక్త కనకదాసు జయంతి సందర్భంగా కనకదాసు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన ఎర్రబెల్లి గ్రామ కురువ పెద్దలు మరియు శ్రీ సత్యసాయి జిల్లా కురుబ కుటుంబ సభ్యులు సామకోటి ఆదినారాయణ * అలాగే మాట్లాడుతూ... *కనకదాసు కర్ణాటకలోని గొప్ప భక్తుడు, ఆధునిక కవి, తత్వవేత్త, సంగీతకారుడు,స్వరకర్త.కనకదాసు కర్ణాటక సంగీతం కోసం కన్నడ భాషలో రచించిన కీర్తనలు, ఉపభోగాల వలన బాగా ప్రాచుర్యం పొందాడు. ఇతర హరిదాసుల్లాగే ఇతను కీర్తనల్లో సాధారణ కన్నడ భాషను ఉపయోగించాడు.కర్ణాటక రాష్ట్రంలో హవేరీ జిల్లా,బాద గ్రామంలో బీరప్ప (బీర్ గౌడ),బాచమ్మ దంపతులకు కనకదాసు 1509 సం.లో జన్మించాడు. కనకదాసు అసలు పేరు తిమ్మప్ప నాయకుడు ఇతను బాగా చదువుకొని సమాజాన్ని అన్ని కోణాలలో సూక్ష్మ పరిశీలన చేశాడు. చిన్న వయస్సులోనే ఇతను నరసింహ స్తోత్రం, రామధ్యాయ మంత్రం, మోహన తరింగిణి అనే కవిత్వాలను రచించాడు. కనకదాసు సామాన్యులకు అర్ధమయ్యే విధంగా కన్నడ భాషలో రచనలు చేస్తూ, కీర్తనలు రాస్తూ, వేదాంతాన్ని అభ్యసించి గొప్ప కృష్ణ భక్తుడయ్యాడు.అతని కీర్తనల్లో ఒకదాని ప్రకారం కనకదాసు ఒక యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు. అద్భుతమైన రీతిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నట్లుగా వ్యాఖ్యానించాడు. తరువాత తన సైనిక వృత్తిని విడిచిపెట్టి, తత్వజ్ఞానాన్ని పామరులకు అర్థమయ్యేలా సంగీత సాహిత్యాలతో కూర్చి అందించేందుకు తన జీవితాన్ని అంకితం చేశాడని, అలాగే ఆయనను స్మరించుకుంటూ కొత్తచెరువు మండలం ఎర్రబెల్లి గ్రామ కురువ పెద్దలు అంతా కలిసి ఆయన విగ్రహానికి పూలమాలవేసి కురువ కులస్తులంతా ఏకతాటిపై డప్పు వాయిద్యాలతో ఆడపడుచుల జ్యోతిలతో గురవయ్యాల ఆటపాటలతో ఊరేగింపు చేసి జయంతి వేడుకలు విజయవంతం చేసిన గ్రామ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన *సామకోటి ఆదినారాయణ * తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కెసాని ఆదినారాయణ,కోగిర కిష్టప్ప,బి రామచంద్ర,బి అంజనేయులు,లింగమయ్య,నాగరాజు,బి రాము,అనిల్ కుమార్,హరి శంకర్,సురేంద్ర,సుబ్బారాయుడు,రామలింగప్ప,అంగడి కిస్ట,నిరంజన్,బి రామమోహన్,జి కిష్టప్ప,జయప్ప,ఆదినారాయణ, వీరనారాయణ,పైపల్లి రవి తదితరులు శ్రీ సత్యసాయి జిల్లా కురువ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :