సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మఖ్తల్ పట్టణంలోని జములమ్మ ఆలయ పున ప్రతిష్టాపన వేడుకల్లో భాగంగా రెండో రోజు గోపూజ, జలాధివాసం నిర్వహించినట్లు దాతలు మనసాని వెంకటేష్, సరళ తెలిపారు. మనసాని రత్నమ్మ, నరసింహ గుప్తా జ్ణాపకార్థం...ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేయగా...పున ప్రతిష్టాపన వేడుకల్లో భాగంగా రెండో రోజు ఉదయం అఖండ దీపారాధనను మనసాని కిరణ్, ప్రత్యూష దంపతులు నిర్వహించారు. అనంతరం అంకురార్పణ చేశారు. ఆ తర్వాత గోమాతను ఆలయంలోకి తీసుకువచ్చి, ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ధ్వజారోహణం లో భాగంగా ఆలయంపై ఓంకార జెండా ఎగురవేశారు. ఆ తర్వాత అమ్మవారి విగ్రహానికి జలాధివాసం చేశారు. ఇక మూడో రోజు గురువారం ధాన్యాదివాసం, శయ్యాదివాసం ఉంటాయని... నాలుగో రోజు శుక్రవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, ఇతర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో బ్రాహ్మణులు శ్యాంసుందర్ జోషి, వంశీ క్రిష్ణ జోషి , విజయేంద్ర చారి, కార్తిక చారి, శేషగిరి, క్రిష్ణ చారి, శ్రావణ్, స్థానికులు మామిళ్ల కిష్టప్ప, వాసవీ రాము, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin