సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మట్టి, ఇసుక అక్రమ రవాణా చేయు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ మైనింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అట్టి ఆదేశాలపై కదిలిన మైనింగ్, రెవెన్యూ అధికారులు రెండు రోజులుగా...భద్రాద్రి జిల్లాలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నా... మైనింగ్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పాల్వంచ మండల పరిధి, తోగ్గూడెంలోని ప్రముఖ క్వారీలో అక్రమంగా డ్రిల్లింగ్ చేస్తున్నారనే పక్క సమాచారం మేరకు దాడులు నిర్వహించి, ఒక టిప్పర్, ఒక బ్రేకర్, రెండు ప్రొక్లైన్ లను స్వాధీనం చేసుకున్నట్లు మైనింగ్ ఎ.డి జయ్ సింగ్ తెలిపారు.... అనుమతులు లేకుండా మట్టి, రాళ్లు, ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు, వాహనాలు సీజ్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మట్టి, ఇసుక రవాణా జరిగే ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా దందా నియంత్రణకు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
-----------------------
Admin