Sunday, 26 July 2026 02:38:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పొంగులేటి...

Date : 09 October 2023 08:43 AM Views : 301

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : చుంచుపల్లి, కొత్తగూడెం మండలాల్లో కాంగ్రెస్ లో భారీ చేరికలు, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, ప్రజలు తలుచుకుంటే జరగనీదంటూ ఏదీ లేదని ఎందరికో అధికారం ఇచ్చారని మరెందరికో అధికారం కూల్చారని, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలనీ వారి ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యమేనని టీపీసీసీ ప్రచార కమిటీ కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు, తూము చౌదరి, ఆళ్ళ మురళి అన్నారు. చుంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తండా, కొత్తగూడెం మున్సిపాలిటీ 5 వార్డ్ లలో 150 కుటుంబాల నుండి సుమారు 400 మంది పలు పార్టీల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరిగే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్చందంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందనీ వివరించారు. చుంచుపల్లి తండా రైతులు తమ పంట పొలాలకు వెళ్లాలంటే గోధుమ వాగు ఉండటం వల్ల సుమారు 6 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందని పొంగులేటికి వినతిపత్రం ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఖచ్చితంగా గోధుమ వాగుపై చాప్టా ఏర్పాటు కోసం కృషి చేస్తానన్నారు... అలాగే కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ తాముంటుంన్న ప్రాంతంలో కనీస సౌకర్యాల కోసం ఇబ్బంది పడుతున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ ప్రాంతాన్ని దత్తత తీసుకోవాలని 5 వార్డ్ యువత కోరగా స్పందించిన పొంగులేటి తానే స్వయంగా దగ్గరుండి మరి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానన్నారు... ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని కచ్చితంగా రానున్న ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని కొత్తగూడెం నియోజకవర్గంలో, రాష్ట్రంలో అధికారం రావడానికి తమ వంతుగా కృషి చేస్తామని అన్నారు... డబ్బులు ఎవరిచ్చిన తీసుకోండి ఓటు కాంగ్రెస్ కు వేయండి : పొంగులేటి ఎన్నికల సమయంలో అధికార పార్టీ నాయకులు డబ్బుల సంచులతో వస్తారని, ఆ డబ్బులు వాళ్ల సొంత డబ్బులు కావని ప్రజలు టాక్క్స్ రూపంలో కట్టిన డబ్బులన్నారు... డబ్బులు ఎవరు ఇచ్చిన తీసుకోని ఇందిరమ్మ రాజ్యం కోసం కృషి చేస్తున్న రాహుల్ గాంధీని దీవించడం కోసం కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలన్నారు. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని కార్యకర్తలు అందరూ తమ వంతుగా ప్రయత్నం చేయాలనీ, ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.. పార్టీలో చేరిన వారిలో చుంచుపల్లి తండా నుండి ఆధ్వర్యంలో భూక్యా చిన్నా, భూక్యా రాందాస్, కున్సోత్ భిక్కు, కున్సోత్ దేవదాస్,కున్సోత్ రవి, మాలోత్ తిరుపతమ్మ, భూక్యా అరుణ, తదితరులు 5 వార్డు నుండి షోయబ్, ఉమర్, సంతోష్, వినోద్, రాజు, రఘు, సోని, రాధ, జయ, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు ఆకునూరి కనకరాజు, పూనెం శ్రీనివాస్, మైనార్టీ నాయకులు గౌస్ భాయ్, అయూబ్ ఖాన్, ఖలీల్ భాయ్, గాలి వెంకన్న, కనకరాజు, సత్యనారాయణ రెడ్డి, సుప్రియ ఆకులూరి, సతీష్, కలకోటి రాజు, మహేష్, అడప నవీన్, ఖమర్, వెంకన్న, కున్సోత్ కిషన్, భూక్యా హేమ్లా, నాగేశ్వరరావు, నిరంజన్ రెడ్డి, శ్యామ్, నరేష్, పండు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: