Monday, 27 July 2026 07:35:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జూలై 12న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్...

Date : 11 July 2023 02:37 AM Views : 442

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డక విద్యావ్యవస్థ పూర్తిగా బ్రష్టు పట్టిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం.పవన్ చౌహాన్, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ ఆన్నారు. వామపక్షాల విద్యార్ధీ సంఘాల ఆధ్వర్యంలో జూలై 12న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్టు వారు ప్రకటించారు. సోమవారం షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట బంద్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ హాస్టల్లో సొంత బిల్డింగులు లేక ఎంతో మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారని అందుకే వామపక్ష విద్యార్థి సంఘాలు అన్ని ఏకమై బంధు పిలుపునివ్వడం జరిగిందని స్పష్టం చేశారు గత నాలుగేళ్లుగా స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 4 వేల కోట్లు బకాయిలు అలాగే ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అంతేగాక ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో బుక్స్, స్టేషనరీ వస్తువుల అమ్మకాలు చేస్తూ విద్యార్థులను తల్లిదండ్రులను నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. కార్పొరేట్ ,ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని,ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా మెస్ బకాయిలను వెంటనే విడుదల చేసి మెస్ చార్జీలు బిల్లులను పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఏ విధంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంగా ఒక మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని వారు తెలిపారు. ఈ బంద్ ను ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పి డి ఎస్ యు, ఏఐడీఎస్ఓ ఏఐఎస్బి, ఏఐపీఎస్సీ, ఏఐఎఫ్డిఎస్, పిడిఎస్యు రాష్ట్ర కమిటీలు కలిసి బంధు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ఆకాష్ నాయక్, శిరీష, రాధిక, పి.శివా నాయక్, విష్ణు, రామ్, ఎస్ఎఫ్ఐ నాయకుడు సాయి కిశోర్, సంధ్య, వాని, విద్యార్థులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :