సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పట్టేటి మహేష్ కుమార్ కుటుంబానికి సీఎం సహాయనిధి నుండి మంజూరైన రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును స్వయంగా వారి నివాసానికి వెళ్లి మృతుని తల్లి పట్టెటి దుర్గమ్మ కు అందజేసిన మన హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అదే గ్రామంలోనీ ముదిరాజ్ బజార్ లో సిడిపి నిధుల నుండి మంజూరైన 5లక్షల రూపాయలతో నూతన సి సి రోడ్డు కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిబి కుతుబ్, ఎంపిటిసి కుందూరు వెంకట రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు చిలక సతీష్ కుమార్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు బూర్రి సుబ్బయ్య నాయుడు, పీరు, సాముల వెంకటేశ్వర రెడ్డి, మఠం పల్లి సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి , ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin