సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలు అందరికీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ అని ఆయన అన్నారు. పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ఆడబిడ్డల దని, పూల పండుగతో తెలంగాణ పులకరించిందని అన్నారు. ఎంగిలి పూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఒప్పొంగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఈ పండుగను జరుపుకునేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి ఏటా కోటి చీరలను అనేక వర్ణాలతో వివిధ డిజైన్లతో రూపొందించి తండ్రిగా అన్నగా అందిస్తున్న గొప్ప నాయకులు అని అన్నారు.
-----------------------
Admin