సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : భారతదేశం చంద్రయాన్-3 విజయవంతమైన వేళ ఇస్రో శాస్త్రవేత్తలను యావత్ ప్రపంచం అభినందనలు తెలుపుతుంది. ఈ సందర్బంగా టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు మాట్లాడుతు ఇది గొప్ప విజయమని చెబుతూ ఈ ఘనతలో భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పాత్ర కీలకమన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 1962లో నెహ్రూ హయాంలోనే స్థాపించబడిందని అప్పట్లో దీనిని ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్(INCOSPAR)గా పిలిచేవారని అన్నారు. ఆయన ముందుచూపుతో వ్యవహరించబట్టే ఈరోజు ఈ ఘనత సాధ్యమైందని అన్నారు. యావత్ భారతదేశం గర్వించదగ్గ విధంగా చంద్రయాన్ 3 చందమామపై కాలు మోపడం అత్యధ్భుమన్నారు. చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొట్టమొదటి దేశంగా భారతదేశం చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు.
-----------------------
Admin