Monday, 27 July 2026 04:24:17 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గృహ లక్ష్మీ నిబంధనలు సడలించకపోతే ఉద్యమిస్తాం పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ డిమాండ్...

Date : 23 August 2023 08:31 AM Views : 393

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (మున్సిపాలిటీ) : రామవరం మున్సిపాలిటీ ఏడు వార్డుల్లో గృహలక్ష్మి నిబంధనలు సడలించకపోతే మహిళలుగా ఉద్యమించక తప్పదని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పదో వార్డులో జరిగిన మహిలా సంఘాల సమావేశంలో మునిగడప పద్మ మాట్లాడుతూ గృహలక్ష్మి దరఖాస్తుదారులకు రిజిస్ట్రేషన్ పట్టా కావాలని నిబంధన ఏడు వార్డుల ప్రజానీకానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైతే రామవరం ప్రాంతానికి ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేసి గృహ నిర్మాణాలకు స్థలాలను ఇచ్చి, సొంత జాగల్లో గృహ నిర్మాణాలు చేసుకునేందుకు ఎలాగా పథకాన్ని అమలుపరిచా రో అలాగే ఇప్పుడు కూడా ఉన్నతాధికారులు దీనిపై ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉన్నత అధికారులకు ఆమె విజ్ఞప్తి చేశారు .లేకుంటే వచ్చే ఎన్నికల్లో రామవరం మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశంలో మహిళా నాయకురాలు మంగమ్మ, మార్తమ్మ ,జానకి, కవిత డి సీత ,అను, సుప్రియ, బేబీ, రాజేశ్వరి, మహేశ్వరి, శ్రీజ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :