Sunday, 26 July 2026 01:36:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసి దుండగులు పరార్ ...

Date : 07 June 2023 10:32 AM Views : 639

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో 35 ఏళ్ళ ఉప్పు శ్రీను అనే వ్యక్తి మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకొచ్చి డోర్‌ డెలివరీ చేశారు. ఒంటిపై గాయాలతో అనుమానాస్పద స్ధితిలో మృతి చెంది ఇంటి ముందు పడి ఉన్న శ్రీను మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బిత్తరపోయారు. అంతే కాకుండా మృతదేహం పక్కన 35 వేలు ఉంచి దహన సంస్కారాలు చేయడానికి అన్నట్టుగా డబ్బులు ఉంచడంతో గ్రామస్తులు ఎక్కడో చనిపోతే ఇక్కడకు తీసుకొచ్చి పడేశారని అనుమానిస్తున్నారు. మరోవైపు హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడకు తీసుకొచ్చి పడేశారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. మృతుడు శ్రీను వారం రోజుల క్రితం పనుల నిమిత్తం ఊరు విడిచి వెళ్ళాడు. పనులు పూర్తి చేసుకుని శ్రీను ఇంటికి వస్తాడను కుంటే అతడి శవాన్ని దుప్పట్లో చుట్టి గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి కారులో తీసుకొచ్చి డోర్ డెలివరీలా ఇంటిముందు పడేసి వెళ్ళారు. మృతదేహం పక్కనే 35 వేలు మట్టి ఖర్చుల కోసమంటూ లెటర్ రాసి పెట్టి వెళ్ళిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. ఉప్పు శ్రీను రెండేళ్ళ నుండి భార్యకు దూరంగా ఉంటూ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :